తెలుగుదేశం ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అసెంబ్లీ పరిసరాలను డ్రోనుతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. పొలాల నుంచీ వస్తారనే అనుమానంతో పొలాల చుట్టూ డ్రోన్లు తిప్పుతున్నారు పోలీసులు.అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి బడుగు బలహీన వర్గాలను నాశనం చేస్తోందంటూ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు నిరసిస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత తదితర అంశాలపై ఆందోళన జరుగుతోంది. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు నేతలు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు టీడీఎల్పీ ఉప నేత చినరాజప్ప. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారు. టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పేదల పథకాలు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా వుండేవన్నారు.
Read Also: God Father: ‘తార్ మార్ తక్కర్ మార్’ వచ్చేస్తోంది..! అభిమానులకు పూనకాలే..