Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!
- నాసిక్‌లో సంచలన ఘటన
- TCS కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలు
- ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు
- సీనియర్ ఉద్యోగులు మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ
- మతపరమైన ఆచారాలు, మార్పిడి విషయంలో ఒత్తిడి తెచ్చినట్టు ఫిర్యాదులు
- కేసులో ఇప్పటివరకు 7 మందిని పోలీసులు అరెస్ట్
- అరెస్టైన వారిలో ఒక సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ కూడా
- మరో మహిళా అధికారి పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్ల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఏ విధమైన వేధింపులకైనా “జీరో టాలరెన్స్” విధానం పాటిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.
డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఈ విషయమై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై సీనియర్ సహచరులు మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అలాగే మతపరమైన ఆచారాలు, మత మార్పిడి విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడు మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. మరో మహిళా అధికారి పరారీలో ఉండగా, ఆమె కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉద్యోగులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, హెచ్‌ఆర్ విభాగం స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.
SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ఈ విషయంపై స్పందించిన TCS ప్రతినిధులు.. కేసు గురించి సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశామని, పోలీసులతో పూర్తిగా సహకరిస్తున్నామని వెల్లడించారు. కంపెనీ నాసిక్ కార్యాలయాన్ని మూసివేయనున్నట్లు వచ్చిన వార్తలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే పోలీసుల ప్రకారం కంపెనీ ఆపరేషనల్ నిర్ణయాలు వారి అంతర్గత వ్యవహారమని తెలిపారు. ప్రస్తుతం SIT దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!