Site icon NTV Telugu

Richest Cat: ఆ పిల్లి ఆస్తి రూ.800కోట్లు.. ప్రపంచంలోనే రిచస్ట్ పెట్ యానిమల్

Cat

Cat

Richest Cat: చాలామంది తమ తదనంతరం ఆస్తిని తమ వారసుల పేరు మీద రాస్తుంటారు. వారసులు లేని పక్షంలో ఆస్తి ట్రస్టులకు, అనాథాశ్రమాలకు రాస్తుంటారు. కానీ పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ మాత్రం తన ఆస్తిలో కొంత భాగాన్ని తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్ పేరు మీద రాసింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన పెంపుడు జంతువుల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ఉన్న సంపన్న పెట్ యానిమల్స్ లో ఇది మూడోస్థానంలో ఉన్నది. ఈ పిల్లి ఆస్తి అక్షరాలా రూ.800 కోట్లు. తన యజమానితో పాటు పలు మ్యూజిక్‌ వీడియోల్లో కనిపించిన బెన్‌సన్‌.. బిగ్‌బడ్జెట్‌ యాడ్‌లలోనూ దర్శనమిచ్చింది.

Read Also: Constable Preliminary: అయ్యో కొడుకా.. మమ్మల్ని వదిలి వెల్లిపోయావా

కాగా.. 100 మిలియన్‌ డాలర్ల ఆస్తితో నాలా క్యాట్‌ అనే పిల్లి రెండో స్థానంలో ఉండగా, 500 మిలియన్‌ డాలర్ల సంపదతో ఓ శునకం మొదటిస్థానంలో ఉన్నది. ఈ పిల్లి… టేలర్ తో 2014 సంవత్సరం నుంచి ఉంటోందట. ఈ ఒలివియాకు స్పెషల్ గా ఇన్ స్టాగ్రామ్ పేజీ లేదు. మరి దానికి ఆదాయం ఎలా వచ్చింది అనే సందేహం మీకు కలగొచ్చు. టేలర్ తన ఫోటోలు, వీడియోల్లో ఆ పిల్లిని చూపిస్తూ ఉంటుంది. ఆమె చేసే మ్యూజిక్ వీడియోల్లో ఇది కూడా నటిస్తూ ఉంటుంది. అలా ఈ పిల్లి పాపులారిటీ సంపాదించుకుంది. దీనికి స్పెషల్ గా ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి. అలా ఆ పిల్లి సంపాదన పెంచుకుంది. ఒలివియా పేరిట ఓ వ్యాపార సంస్థ కూడా ఉండటం విశేషం. వీటి ద్వారా దీనికి ఆదాయం వస్తూ ఉంటుంది.

Exit mobile version