Site icon NTV Telugu

Tata Safari: కారు లవర్స్ గెట్ రెడీ.. టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్ వెర్షన్స్ వచ్చేస్తున్నయ్..

Tata

Tata

భారతదేశంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన టాటా మోటార్స్, మల్టీ సెగ్మెంట్స్ లో వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవల టాటా సియెర్రాను విడుదల చేసింది. ఇప్పుడు టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్-ఇంజిన్ వేరియంట్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ SUVలు పెట్రోల్ ఇంజిన్‌లతో రానున్నాయి. తయారీదారు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, టాటా సఫారీ, హారియర్ పెట్రోల్ వెర్షన్లలో సియెర్రా మాదిరిగానే పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

Also Read:Star Hero : సొంత ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో ఎందుకనో దూరంగా ఉంటున్నాడు

కంపెనీ 1.5-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది 106 PS శక్తిని, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCA ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. రెండవ ఇంజిన్ ఆప్షన్ 1.5-లీటర్ హైపెరియన్ ఇంజిన్, ఇది 160 PS శక్తిని, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. టాటా రాబోయే కొన్ని వారాల్లో హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Exit mobile version