రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో Nexon Camo Edition లాంచ్..
- స్పెషల్ ఎడిషన్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో..
- మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Nexon Camo Edition: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో టాటా నెక్సాన్ కామో ఎడిషన్ (Tata Nexon Camo Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ SUV రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్స్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ వంటి అప్గ్రేడ్లతో ఈ ఎడిషన్‌ను లాంచ్ అయ్యింది. అయితే ఇంజిన్ ఎంపికల్లో ఎలాంటి మార్పులు రాలేదు.
కామో డిజైన్:
ఈ కారుకు మున్నార్ మిస్ట్ (Munnar Mist), కూర్గ్ క్లౌడ్ (Coorg Cloud) అనే రెండు ప్రత్యేక రంగులను అందించారు. ముందు ఫెండర్లపై కామో బ్యాడ్జింగ్ ను జోడించడం ద్వారా ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. మొత్తం డిజైన్ మాత్రం రెగ్యులర్ నెక్షన్ మాదిరిగానే కొనసాగింది.
Also Read
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త డ్యాష్‌క్యామ్:
ఇంటీరియర్‌లో కూడా కామో థీమ్‌ను కొనసాగించారు. ముందు సీట్ల హెడ్రెస్ట్లపై ‘Camo’ పెర్ఫొరేషన్ డిజైన్ ను అందించారు. ఈ ఎడిషన్‌లో 12.3-అంగుళాల హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హైలెట్. ఇది సాధారణ నెక్షన్ లో ఉండే 10.25 అంగుళాల స్క్రీన్ స్థానంలో వచ్చింది. అయితే 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను యథాతథంగా కొనసాగించారు. అలాగే 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌తో పనిచేసే ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ ను కూడా అందించారు. దీంతో ప్రయాణాల వీడియోలను ప్రత్యేకంగా డ్యాష్‌క్యామ్ అమర్చకుండా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫీచర్లు, సేఫ్టీ:
వేరియంట్‌ను బట్టి ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, JBL 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కూడా అందించారు.
పెట్రోల్, డీజిల్, CNG ఇంజిన్ ఆప్షన్లు:
నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఇప్పటికే ఉన్న ఇంజిన్ ఎంపికలనే కొనసాగించారు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఎడిషన్ 120hp పవర్, 170Nm టార్క్ అందిస్తుండగా.. 1.5-లీటర్ డీజిల్ వేరియంట్ 115hp పవర్, 260Nm టార్క్ ను, అలాగే 1.2-లీటర్ టర్బో CNG కారు 100hp పవర్, 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్, AMT, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
Every drive asks a different question. The Nexon has an answer for each one.
Book your Tata Nexon now – https://t.co/XXHrp2hAht#Nexon #TataNexon #TataMotorsPassengerVehicles pic.twitter.com/8paER4JYM9
— Tata Motors Cars (@TataMotors_Cars) July 30, 2026
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!