Site icon NTV Telugu

టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. ప్రతి ఒక్కరికి Tata Sierra కారు..!

Tata Sierra

Tata Sierra

Tata Sierra: భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ పేర్కొంది.

Hyderabad: లివ్‌ఇన్ రిలేషన్.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు మృతి..

నవంబర్ 2న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ను గెలవడం ఇదే తొలిసారి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ MD, CEO శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. భారత మహిళా క్రికెట్ జట్టు తమ అసాధారణ ప్రదర్శన, అద్భుతమైన విజయంతో దేశం మొత్తాన్ని గర్వించేలా చేసింది. వారి ప్రయాణం పట్టుదల, విశ్వాసం యొక్క శక్తికి ఇది ప్రతీక. ఈ విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది. టాటా మోటార్స్‌కు ఈ లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన టాటా సియెరాను బహుమతిగా ఇవ్వడం గర్వకారణమని.. ఇది ఇద్దరు దిగ్గజాల ఉమ్మడి స్ఫూర్తికి, అనంతమైన ప్రేరణకు చిహ్నం అని అన్నారు.

ACB Raids: ఏపీలో రెండో రోజు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులపై ఏసీబీ దాడులు..

భారత్‌కు ప్రపంచ విజయాన్ని అందించిన మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి సభ్యురాలికి ఒక టాటా సియెరా ఎస్‌యూవీని బహుమతిగా ఇస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా సియెరాను నవంబర్ 25న అధికారికంగా విడుదల చేయనున్నారు. కంపెనీ సియెరా మొదటి బ్యాచ్‌లోని టాప్ మోడల్‌ను వారికి బహుమతిగా ఇవ్వనుంది. ఈ టాటా సియెరాలో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అధునాతన కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది. ఈ రెండూ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తాయి. టాటా సియెరా ధర గురించి ఖచ్చితంగా తెలియకపోయిన.. దీని ధరలు రూ.13.50 లక్షల నుండి రూ.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.

Exit mobile version