Tata Harrier EV: సింగిల్ ఛార్జ్.. 627 కి.మీ. రేంజ్, లెవల్ 2 ADAS ఫీచర్లతో టాటా హ్యారియర్ EV లాంచ్..!
- టాటా హ్యారియర్ EV లాంచ్
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు
- సింగిల్ ఛార్జ్.. 627 కి.మీ. రేంజ్
- లెవల్ 2 ADAS లతో పాటు అనేక ప్రీమియం ఫీచర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Harrier EV: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV హ్యారియర్ EVను విడుదల చేసింది. జూలై 2వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి టాటా తీసుకొచ్చిన ఈ SUV మొదటిసారిగా పరిచయం చేసిన అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, సఫారి స్టోర్మ్ తర్వాత టాటా నుంచి AWD (ఆల్-వీల్ డ్రైవ్) వ్యవస్థను కలిగి ఉన్న మొదటి మోడల్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ ధరను రూ. 21.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది కంపెనీ.
డిజైన్:
హ్యారియర్ ఈవి డిజైన్ పరంగా తన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ, కొన్ని ప్రత్యేకమైన డిజైన్ అంశాలతో ఇది తనదైన గుర్తింపును పొందింది. మూసివేసిన గ్రిల్, వెడల్పుగా ఉండే LED స్ట్రిప్, DRLs వంటి డిజైన్ హైలైట్స్ గా ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌పై అనేక రేఖలతో కూడిన హెడ్‌ల్యాంప్ హౌసింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. 19 అంగుళాల కొత్త అలాయ్ వీల్స్, నాలుగు రకాల రంగుల ప్యాలెట్ (నైనితాల్ నాక్టర్న్, ఎంఫవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే) తో పాటు స్టెల్త్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.
Also Read
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..

ఫీచర్లు, టెక్నాలజీ:
హ్యారియర్ EVలో, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.53 అంగుళాల హార్మన్ సోర్స్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మోదసారి పరిచయం చేసిన ఫీచర్లు ఉన్నాయి. JBL బ్లాక్ 10 స్పీకర్ సౌండ్ సిస్టమ్ డాల్బీ అట్మాస్‌తో అదనపు వినోదాన్ని అందిస్తుంది. అంతేకాక, పవర్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్రైవర్ మెమొరీ ఫంక్షన్, వాయిస్-కంట్రోల్ పానోరామిక్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్, విండో సన్‌బ్లైండ్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్, 502 లీటర్ల బూట్ స్పేస్ (999 లీటర్ల వరకు విస్తరించగల సామర్థ్యం) వంటి అనేక లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. AWD వేరియంట్‌లో అదనంగా 35 లీటర్ల ఫ్రంక్ కూడా ఉంది.
హ్యారియర్ ఈవిలో వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఆటోనమస్ పార్కింగ్ అసిస్టెంట్, సమ్మన్ మోడ్, రివర్స్ అసిస్టెంట్, పాడ్డ్లే షిఫ్టర్స్ తో కూడిన మల్టీ రీజనరేషన్ మోడ్‌లు, 540 డిగ్రీ సరోండింగ్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also: IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?
భద్రతా ఫీచర్లు:
హ్యారియర్ ఈవి 7 ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ వీడియో రికార్డర్, TPMS, హిల్ హోల్డ్ అండ్ డిసెంట్ కంట్రోల్, రైన్ సెన్సింగ్ వైపర్లు, డిస్క్ బ్రేక్స్, లెవల్ 2 ADAS ఫీచర్లు, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, AVAS వంటి భద్రతా అంశాలను అందిస్తుంది.
పవర్‌ట్రైన్, పెర్ఫార్మెన్స్:
హ్యారియర్ EV 65 kWh, 75 kWh రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 75 kWh వేరియంట్ 627 కి.మీ. రేంజ్‌ను ఇవ్వగలదు. 120 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 15 నిమిషాల్లో 250 కి.మీ. వరకూ రేంజ్ పొందవచ్చు. 20% నుండి 80% ఛార్జింగ్‌కు 25 నిమిషాలు పడుతుంది. అలాగే AWD వేరియంట్‌లో 155 hp ఫ్రంట్ మోటార్, 234 hp రియర్ మోటార్ ఉన్న రెండు మోటార్ల సెటప్ ఉంటుంది. మొత్తం 504 Nm టార్క్ తో 0-100 kmph వేగాన్ని 6.3 సెకన్లలో చేరుతుంది. AWDలో Boost, Sport, City, Eco మోడ్‌లు ఉండగా, RWD వేరియంట్‌లో Eco, City, Sport మోడ్‌లు ఉన్నాయి. ఇంకా ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు మల్టీ-లింక్ సస్పెన్షన్, 6 టెరైన్ మోడ్‌లు అందించబడ్డాయి.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!