Site icon NTV Telugu

Tarun Marriage: మెగా ఇంటికి అల్లుడు.. పెళ్లి వార్తలపై స్పందించిన తరుణ్!

Tarun

Tarun

Hero Tarun Gives Clarity on Wedding Rumours with Niharika Konidela: టాలీవుడ్‌ లవర్ బాయ్, హీరో ‘తరుణ్‌’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్‌ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదని స్పష్టం చేశారు.

‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా నాకు పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటా. సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నా పెళ్లి వార్త చెబుతా. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు’ అని హీరో తరుణ్‌ అన్నారు. తరుణ్‌ స్వయంగా పెళ్లి వార్తలపై స్పందించడంతో నెట్టింట వచ్చే పుకార్లకు చెక్ పడింది.

Also Read: Malli Pelli Movie: నరేష్‌ ‘మళ్లీ పెళ్లి’కి లైన్ క్లియర్.. రమ్య రఘుపతిపై నిషేధం!

తరుణ్‌ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడారు. త్వరలోనే తన కొడుక్కి పెళ్లి చేస్తానని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో నెటిజన్లు పలు పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. చివరకు మెగా ఫ్యామిలీ అల్లుడు అని ఫిక్స్ అయ్యారు. ఈ వార్తలు తరుణ్ వద్దకు చేరడంతో.. స్వయంగా స్పందించి వదంతులకు పులిస్టాప్ పెట్టారు.

‘మనసు మమత’తో తరుణ్‌ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల నటుడిగా పలు చిత్రాలలో నటించారు. 2000లో విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమ కథల్లో నటించి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తరుణ్ చివరగా నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్.. బిజినెస్‌లో బిజీగా ఉన్నారు.

Also Read: Sanju Samson: 9 ఏళ్ల బాధను బయటపెట్టిన సంజూ శాంసన్!

Exit mobile version