Tarun Marriage: మెగా ఇంటికి అల్లుడు.. పెళ్లి వార్తలపై స్పందించిన తరుణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Tarun Gives Clarity on Wedding Rumours with Niharika Konidela: టాలీవుడ్ లవర్ బాయ్, హీరో ‘తరుణ్’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదని స్పష్టం చేశారు.
‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా నాకు పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటా. సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నా పెళ్లి వార్త చెబుతా. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు’ అని హీరో తరుణ్ అన్నారు. తరుణ్ స్వయంగా పెళ్లి వార్తలపై స్పందించడంతో నెట్టింట వచ్చే పుకార్లకు చెక్ పడింది.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
Also Read: Malli Pelli Movie: నరేష్ ‘మళ్లీ పెళ్లి’కి లైన్ క్లియర్.. రమ్య రఘుపతిపై నిషేధం!
తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడారు. త్వరలోనే తన కొడుక్కి పెళ్లి చేస్తానని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో నెటిజన్లు పలు పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. చివరకు మెగా ఫ్యామిలీ అల్లుడు అని ఫిక్స్ అయ్యారు. ఈ వార్తలు తరుణ్ వద్దకు చేరడంతో.. స్వయంగా స్పందించి వదంతులకు పులిస్టాప్ పెట్టారు.
‘మనసు మమత’తో తరుణ్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల నటుడిగా పలు చిత్రాలలో నటించారు. 2000లో విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమ కథల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తరుణ్ చివరగా నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్.. బిజినెస్‌లో బిజీగా ఉన్నారు.
Also Read: Sanju Samson: 9 ఏళ్ల బాధను బయటపెట్టిన సంజూ శాంసన్!
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!