రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏర్పాట్లు, బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. 2500 మంది పోలీసులతో స్టేడియం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టేడియం చుట్టూ 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టేడియం లోపల కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రత్యేక ఐటీ సెల్ టీమ్ మానిటరింగ్ చేస్తుందన్నారు తరుణ్ జోషి. మ్యాచ్ కి మూడు రోజుల ముందే స్టేడియంను మా అదుపులోకి తీసుకున్నామని, రెండు ఆక్టోపస్ టీమ్స్ కూడా స్టేడియం వద్ద బందోబస్తు లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Election Campaign: ఏపీలో ప్రచారానికి కౌంట్డౌన్ మొదలు..
ఈవ్ టీజింగ్ కంట్రోల్ కోసం.. షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్టేడియం లోపల అధిక ధరలకు వస్తువుల విక్రయించే వెండర్స్ పై చర్యలు తీసుకుంటామని, మ్యాచ్ రోజుల్లో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తరుణ్ జోషి తెలిపారు. మ్యాచ్ కి మూడు గంటల ముందు నుంచి గేట్స్ ఓపెన్ చేస్తామని, 4 వేల కార్లు, 6 వేల బైకులు సరిపడేలా పార్కింగ్ సదుపాయం కల్పించామని, వికలాంగుల కోసం.. గేట్ నెంబర్ 3 నుంచి ప్రత్యేకంగా ఎంట్రీ ఇస్తున్నామన్నారు. స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దని .. కెమెరాలు, సిగరేట్స్, బైనక్యులర్స్, హెల్మెట్స్, ఫుడ్ ని స్టేడియం లోపలికి అనుమతించమని స్పష్టం చేశారు.
Chandrababu: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ.. యవతతో సమావేశంలో చంద్రబాబు