Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tarun Bhascker Opens Up On Love Life Viral Comment

Tarun Bhascker : మొత్తానికి లవ్ మ్యాటర్‌పై ఓపెన్ అయిన యంగ్ డైరెక్టర్..

Published Date :November 22, 2025 , 1:37 pm
By Mounika
Tarun Bhascker : మొత్తానికి లవ్ మ్యాటర్‌పై ఓపెన్ అయిన యంగ్ డైరెక్టర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ‘పెళ్లిచూపులు’తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’, ఇటీవల ‘కీడా కోలా’ తో మరో విజయాన్ని సాధించారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీ గా కొనసాగుతున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్ ఒక టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు కాదు.. వారు ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక

ఇద్దరూ కలిసి ఉంటున్నారనీ, త్వరలో పెళ్లి కూడా చేసుకునే ప్లాన్‌లో ఉన్నారనీ టాక్ వినిపిస్తోంది. ఈ రూమర్స్ మధ్య తాజాగా ఆయన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది.‘మీరు చూసిన గ్రేట్ లవ్ స్టోరీ ఎవరిది?’ అని యాంకర్ అడగగా, తరుణ్ భాస్కర్ వెంటనే, ‘నాదే అండి నేను ఇప్పుడు లవ్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో మా లవ్ స్టోరీనే గ్రేట్ లవ్ స్టోరీ అంటారేమో!’ అంటూ నవ్వుతూ చెప్పేశారు. దీనికి యాంకర్ కూడా, “పేరు నాకు తెలుసు కానీ బయటకి చెప్పను” అంటూ మరింత ఆసక్తికరంగా రియాక్ట్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయిపోయింది. ఇక కొంతకాలంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ – హీరోయిన్ ఈషా రెబ్బా లవ్‌లో ఉన్నారన్న వార్తలు తెగ హీట్ అవుతున్నాయి.

వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి’ (మలయాళం జయ జయహే రీమేక్) షూటింగ్ సమయంలోనే దగ్గరయ్యారనీ, అదే ప్రేమగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. దీపావళి రోజున కూడా ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అదీ కాక ఇద్దరూ వరంగల్ జిల్లాకే చెందినవారన్న విషయం కూడా ఈ టాక్‌ను ఇంకా పక్కాగా చేస్తోంది. అయితే ఈ ప్రేమ వార్తలపై తరుణ్ – ఈషా ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ తరుణ్ తాజా కామెంట్‌తో మాత్రం నెటిజన్లలో కొత్త కుతూహలం మొదలైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eesha Rebba dating rumours
  • Keeda Kola director personal life
  • Om Shanti Shanti remake shoot
  • Raju Weds Rambai event
  • Tarun Bhascker Eesha Rebba relationship

తాజావార్తలు

  • Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

  • Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్

  • Virat Kohli-RCB: 4-5 రోజులుగా ఆరోగ్యం బాలేదు.. అయినా ఆర్‌సీబీ కోసమే బరిలోకి దిగా!

  • Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు..

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions