ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల తక్కువగా ఉన్నప్పటికీ.. ఓటిటిలో మాత్రం అనేక రకాల జోనర్లకు సంబంధించి సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని హర్రర్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా వాటికి కామిడీ కూడా జత చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇకపోతే మార్చి 15 2024 న రిలీజ్ అయిన ‘తంత్ర’ మూవీ కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతోంది.
Also read: Vemulawada: రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు.. నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు
కేవలం కొద్ది థియేటర్స్ లలో విడుదలైన తంత్ర సినిమా అతి కొద్ది కాలంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది. సినిమా విడుదల మంచి టాక్ తెచ్చుకున్న కానీ., ఎందుకో కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయింది. ఈ సినిమా క్షుద్ర పూజలు నేపథ్యంలో తెరకెక్కింది. పూర్తి హర్రర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు ఆహా టీం ‘ తంత్రం మంత్రం కుతంత్రం..
ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
Also read: Yarlagadda Venkat Rao: పూజలు నిర్వహించి.. ఎన్నికల ప్రచారం మొదలెట్టిన యార్లగడ్డ వెంకట్రావు!
ఇక ఈమధ్య మనకు కాస్త డిఫరెంట్ జోనర్లో విడుదలైన పోలిమేర 2, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మరో హారర్ చిత్రాన్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో సినిమా థియేటర్లకి వెళ్లి చూద్దామని మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో అనన్య నాగళ్ల,ధనుష్ రఘుముద్రి,సలోని,టెంపర్ వంశీ,మీసాల లక్ష్మణ్ లు ప్రధాన పాత్రలలో నటించగా.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం చేపట్టారు.
తంత్రం మంత్రం కుతంత్రం..☠️
ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!🎬#Tantra Premieres April 05 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/bRJqdHUS87— ahavideoin (@ahavideoIN) March 31, 2024