వంటలకు రారాజు టమోటా.. ప్రతి కూరలోనూ టమోటాలను వాడతారు.. అందుకే టమోటలకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది.. టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చాలా మందికి టమోటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం కామన్.. దానికి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలమొక్కటే కాదు మిగతా కాలాల్లో కూడా వీటిని తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మొదలగు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి టమాటాలను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకం, వీరేచనాలు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి..
ఈ టమోటాలు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి.. ఇకపోతే ఒక కప్పు చిన్న టమోటాలు సుమారుగా 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు కూడా టమాటాలను తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలు కలిగిన టమాటాలను కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమోటోలను తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది.. చర్మం రంగు మెరుగుపడుతుంది.. ఇంకా జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.