NTV Telugu Site icon

Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెట‌ర్..

Tammy Beaumont

Tammy Beaumont

తాజాగా ఓ మహిళ క్రికెటర్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళాడింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ట‌మ్మీ బ్యూమంట్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంలో దూకుడుగా ఆడే ట‌మ్మీ బ్యూమంట్ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రియుడు క‌ల్ల‌మ్ డావేను వారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

Also read: Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్‌ పైనే..

అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో ఇరువైపుల బంధుమిత్రుల సమక్షంలో వీరు ఒకటయ్యారు. ఇకపోతే ఈ పెళ్ళికి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లయినా డాని వ్యాట్, కేట్ క్రాస్, అలెక్స్ హ‌ర్ట్లే, సారాహ్ గ్లెన్ లతో పాటు అనేకమంది ఆటగాళ్లు అందరూ వివాహానికి హాజరయ్యారు.

Also read: MP K.Laxman : కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు

ఇక ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్టలో నేను నా సోల్మెట్ ను నిన్న పెళ్లి చేసుకున్నానని.. మా వివాహం జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలుపుతూ., మీ అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ట‌మ్మీ బ్యూమంట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించింది. మహిళా టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ కొట్టిన మహిళగా రికార్డు నెలకొల్పింది. బ్యూమంట్ రికార్డు పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 1935లో ఆమె చేసిన 189 పరుగులే అప్పటివరకు అత్యధికం.

Show comments