Site icon NTV Telugu

Tammineni Veerabhadram : ఓఆర్‌ఆర్‌ లీజు విధి విధానాలను బయటపెట్టాలి

Tammineni Verabhadram

Tammineni Verabhadram

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని 158 కిలో మీటర్ల విస్తర్ణంలో వున్న నెహ్రూ ఔటర్‌ రింగ్‌రోడ్డును కేవలం రు.7380 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకిచ్చిందని మండిపడ్డారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ లీజుకు ఇవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున తక్షణమే ఓఆర్‌ఆర్‌ లీజు విధివిధానాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. హైదరాబాదుకు మణిహారంగా, ప్రజలకు సౌకర్యంగా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న ఓఆర్‌ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముంబాయికి చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ అనే ప్రయివేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం లీజుకివ్వాలని నిర్ణయించింది.

Also Read : Karnataka Polls: సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ఈసీకి ఫిర్యాదు

రాష్ట్ర కేబినిట్‌లో 6నెలల క్రితమే లీజు నిర్ణయం జరిగినా గోప్యంగా ఉంచిందని, ప్రతి యేటా పెరుగుతున్న ఓఆర్‌ఆర్‌ ఆదాయం మేరకు లీజు నిర్ణయం జరగలేదని, నిబంధనలేమీ పాటించలేదని, వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆర్థిక నిపుణులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదానీ, అంబానీల లాంటి ప్రయివేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్నది. ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటామని, ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ తదితరాలను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టకుండా చూడాలని, లీజుకు సంబంధించిన విమర్శలు వస్తున్నందున ఒప్పంద వివరాలను ప్రజలముందుంచాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.

Also Read : Asia Cup 2023 : పాక్ లో ఆసియాకప్ ఆడేందుకు నిరాకరించిన ఆ రెండు టీమ్స్

Exit mobile version