Tamilisai: అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ
- అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ
- ఎన్నికలకు సంబంధించిన వివరాలు అడిగినట్లు వెల్లడి
- అనవసరమైన ఊహాగానాలు సృష్టించారని ఖండన
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీపై హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకు వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. స్టేజీపైకి వచ్చిన తమిళిపై అందరికీ నమస్కారం చేసుకుంటూ.. వెంకయ్యనాయుడు ప్రక్కన కూర్చున్న అమిత్ షాకి నమస్కరించి ముందుకు వెళ్తుండగా వెనక్కి పిలిచి.. సీరియస్‌గా మాట్లాడడం కనిపించింది. ఆయనేదో మాట్లాడుతుండగా.. తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. వారు మాట్లాడుతుండగా వెంకయ్యనాయుడు అలా చూస్తూనే ఉండిపోయారు. అనంతరం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తమిళిసైకు అమిత్ షా వార్నింగ్ అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. తమిళనాడులోని డీఎంకే పార్టీ కూడా ఖండించింది. ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించడం పద్ధతి కాదని తప్పుపట్టింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తాజాగా తమిళిసై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై-తమిళిసై వర్గాల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైకి క్లాస్ పీకినట్లుగా వార్తలు వినిపించాయి.

Governoar
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!