Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు అందరిని షాక్ కు గురిచేసింది. వివరాలలోకెళితే సినిమా నిర్మాణ వ్యయంలో స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల పారితోషికాలకే బడ్జెట్ సరిపోతుండటంతో నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చెన్నైలో ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతల మండలి ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలకు ఇకపై అడ్వాన్స్ రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని, రెవిన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
రెవిన్యూ షేర్ విధానం : ఈ కొత్త నిబంధన ప్రకారం అగ్ర హీరోల నుంచి చిన్న స్థాయి టెక్నీషియన్ల వరకు ఎవరికీ సినిమా ప్రారంభంలో లేదా షూటింగ్ సమయంలో కోట్లలో పారితోషికం ఇవ్వరు. సినిమా పూర్తయి, విడుదలయ్యాక వచ్చే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలలో అందరికీ వాటా ఇస్తారు. సినిమా హిట్టయి లాభాలు వస్తే అందరూ పంచుకుంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని కూడా నటీనటులు సాంకేతిక నిపుణులు భరించాల్సి ఉంటుంది. దీనివల్ల కేవలం సినిమా మేకింగ్‌కు మాత్రమే ఖర్చు అవుతుంది కాబట్టి నిర్మాతపై ఆర్థిక భారం తగ్గుతుంది.
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
సమ్మెకు సై : ఈ నిర్ణయానికి వ్యతిరేకత వస్తే మే 2వ తేదీన టోకెన్ స్ట్రైక్ నిర్వహించాలని అప్పటికీ నడిగర్ సంఘం (తమిళ నటీనటుల సంఘం) సహకరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే రజనీకాంత్ వంటి అగ్ర హీరోలు గతంలోనే లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని ప్రోత్సహించారు. కానీ నేటితరం యంగ్ స్టార్స్ ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
టాలీవుడ్ సంగతేంటి : తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది. తెలుగులో కూడా అగ్ర హీరోల రెమ్యునరేషన్లు రూ. 100 కోట్లు దాటుతున్నాయి. ఒకవేళ ఇదే విధానం ఇక్కడ అమలైతే పరిస్థితి ఏంటి. గ్లోబల్ మార్కెట్ ఉన్న మన హీరోలు ఈ షేర్ విధానానికి ఒప్పుకుంటారా. చిన్న నిర్మాతలకు ఇది వరమే అయినా పెద్ద సినిమాల విషయంలో స్పష్టత రావలసి ఉంది. మొత్తానికి కోలీవుడ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!