Site icon NTV Telugu

Liquor Shops Shut Down: సంపూర్ణ మద్యపాన నిషేధంవైపు అడుగులు.. రేపటి నుంచి 500 మద్యం షాపులు మూత..

Liquor Shops

Liquor Shops

Liquor Shops Shut Down: మద్యం ప్రియులు క్రమంగా పెరిగిపోతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.. అయితే, రాష్ట్రాలను బట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి.. తమిళనాడు సర్కార్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (TASMAC) ఆధ్వర్యంలో నిర్వహించే 500 లిక్కర్‌ షాపులను మూసి వేస్తున్నట్టు.. తమిళనాడు ప్రభుత్వ రిటైలర్‌ టాస్మాక్‌ ప్రకటిచింది.. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. తొలి విడతలో స్కూళ్లు, టెంపుల్స్‌ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేస్తున్నట్టు పేర్కొంది..

Read Also: Viral Video: మద్యం తాగుతున్న కోతి.. ఆదిపురుష్ చూసి వచ్చిందేమో అని జనాలు కామెంట్స్..!

కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చింది.. ఇక, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానంలో కీలక మార్పులు చేసింది.. ఇప్పుడు 500 మద్యం రిటైల్ షాపులను జూన్ 22 నుండి మూసివేస్తామని, వాటి మూసివేతకు గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) అమలులోకి వస్తుందని రాష్ట్ర-రక్షణ మద్యం రిటైలర్ (TASMAC) బుధవారం తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొన్ని నెలల కిందట ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది.. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఏప్రిల్‌లోనే మద్యం దుకాణాల మూసివేతపై ప్రకటన చేశారు.

Read Also: Pawan Kalyan: ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో నా ఫ్యాన్స్ గొడవపడుతున్నారు.. కులం కోసం కొట్టుకోకండి

అయితే, మార్చి 31 నాటికి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 5,329 మద్యం రిటైల్ షాపులు ఉన్నాయి.. అందులో 500 షాపులను గుర్తించి మూసివేస్తామని ఏప్రిల్ 12న రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది స్టాలిన్‌ సర్కార్‌.. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు.. అప్పుడు చేసిన అసెంబ్లీ ప్రకటనను గుర్తు చేసుకుంటూ.. ఆ తర్వాత ఏప్రిల్ 20న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.. 500 రిటైల్ మద్యం దుకాణాలను గుర్తించి, వాటిని మూసివేస్తున్నట్టు జీవోలో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 500 రిటైల్ అవుట్‌లెట్‌లు జూన్ 22 నుంచి అంటే రేపటి నుంచి మూసివేయాలని ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు.. ప్రతిపక్ష పీఎంకే ప్రభుత్త చర్యను స్వాగతించింది.. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని స్టాలిన్‌ను కోరింది.

Exit mobile version