Site icon NTV Telugu

Tamil Nadu: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి అరెస్ట్

Tamil Minister

Tamil Minister

తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలోని ఆయన ఆఫీసులో.. కోయంబత్తురు, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.. దాదాపు 18 గంటల పాటు మంత్రిని ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read : Venkatarami Reddy: డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మరోసారి అరెస్ట్.. కారణం ఇదీ..

మంత్రి సెంథిల్ బాలాజీ భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లభించడంతో ఇవాళ ఉదయం ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఛాతినొప్పి అంటూ ఒక్కసారిగా మంత్రి సెంథిల్ బాలాజీ కూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశ కనిపిస్తుంది.

Also Read : Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వరుణ్‌-లావణ్యల తొలి ఫోటో.. నెట్టింట వైరల్‌!

తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు. మంత్రులు ఉద‌య‌నిధి స్టాలిన్, సుబ్రమణ్యం, ఎవ వేలు, రఘుప‌తి, శేఖ‌ర్ బాబు త‌దిత‌రులు ఆసుప‌త్రికి వెళ్లి ఆయన ప‌రామర్శించారు. ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మంత్రి మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కారులో పడుకుని నొప్పితో సెంథిల్ బాలాజీ ఏడుస్తూ కనిపించాడు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ తమిళనాడులో హాట్ టాఫిక్ గా మారింది.

https://twitter.com/ANI/status/1668737885242286080

Exit mobile version