Crime News: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువకుడు.. తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు.. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్‌లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు..
Read Also: Perni Nani: మాజీ మంత్రి సంచలనం..! రప్పా.. రప్పా.. అనేది కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి అంతే..!
అయితే, రాయుడును చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసిన నిందితులు.. ఈనెల 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డులోని నివాస ప్రాంతం వెనుక అతడి మృతదేహాన్ని పడవేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగించి హత్యలో పాల్గొన్న కాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్, చంద్రబాబుతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అసలు, రాయుడును ఎందుకు చిత్రహింసలు పెట్టారు.. అంత దారుణంగా హత్యకు చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. నిందితులను కాళహస్తి తీసుకెళ్లి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు….
