Site icon NTV Telugu

Tamil Nadu: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం.. దాన్ని ఏం చేసిందంటే?

Gold

Gold

తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగించింది. ఈ బంగారం 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదంతా నిరుపయోగంగా ఉందని..ఈ వెయ్యి కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్వర్ణాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ.17.81 కోట్లు వడ్డీ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

READ MORE: Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?

అయితే.. వడ్డీ ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమయ్యే ఉంటుంది. దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది. పెట్టుబడి ద్వారా వచ్చే వడ్డీని సంబంధిత ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని వెల్లడించింది. ఈ మేరకు హిందూ మత, దేవాదాయ శాఖకు సంబంధించిన ఓ విధానపర పత్రాన్ని మంత్రి శేఖర్‌ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఒకరు చొప్పున ముగ్గురు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే.. ఈ 21 ఆలయాల్లో తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మరియమ్మన్‌ ఆలయం నుంచి గరిష్టంగా 424 కేజీల బంగారం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

READ MORE: Food Safety : అమీర్‌పేట్‌లో జ్యూసులు తాగుతున్నారా..? జర జాగ్రత్త.. తరువాత మీ ఇష్టం..!

Exit mobile version