NTV Telugu Site icon

Tension in Cuddalore: తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేసిన తమిళనాడు సర్కార్

Tamilnadu

Tamilnadu

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వి.. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఆర్దీసీ బస్సులను సైతం నిరసన కారులు ధ్వంసం చేశారు. ఎన్‌ఎల్‌సీ విస్తరణను నిరసిస్తూ పీఎంకే నేత అన్బుమణి రామదాస్ నేతృత్వంలో నైవేలిలో భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Read Also: Gold And Silver PRices: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..!

కడలూరులో నైవేలి థర్మల్ పవర్ ప్లాంట్ రెండువ గని విస్తరణ పనులను వ్యతిరేకిస్తున్న ఏఐడీఎంకే, పీఎంకే పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు. విస్తరణలో భాగంగా వేలాది ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను ఎన్ఎల్ సీ అధికారులు చదువు చేస్తున్నారు. దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.. ఇక రైతులకు పీఎంకే నేత అన్బుమణి రామదాస్ అధ్వర్యంలో మద్దతు ఇవ్వడంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నైవేలి నిరసనలో పోలీసులపై రాళ్ళు రువ్వీ, వాహనాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఇక పీఎంకే నేత రామదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Minister Jogi Ramesh: సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయి

తమిళనాడులోని కడలూరు జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా ఆర్డీసీ బస్సు సర్వీసులను నిలిపి వేస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులకు పరిహారం చెల్లించాలని, పంట పొలాలను సర్వనాశనం చేయవద్దని ఎన్ఎల్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలు హెచ్చరించారు. కాగా, నిరసనలు ఉధృతం అవుతుండడటంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.