NTV Telugu Site icon

Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!

Untitled Design (3)

Untitled Design (3)

New Couples killed 3 days after wedding in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. సొంత కుటుంబ సభ్యులే ఓ యువతి, యువకుడిని దారుణంగా చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడిన యువకులు.. కొత్త జంటను దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు.

తూత్తుకూడికి చెందిన కార్తీక (20), సేల్వం (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి జీవించాలుకున్న వారు.. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం తల్లిదండ్రులు చెబితే.. కార్తీక కుటుంబ సభ్యులు ఓప్పుకోలేదు. ఒకరినివిడిచి మరొకరు ఉండలేని వారు.. అక్టోబరు 31న ఇంటి నుండి వెళ్లిపోయారు. కార్తీక, సేల్వం మూడురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి మురుగేషన్ నగర్‌లో వారు ఉంటున్నారు. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని కార్తీక కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.

Also Read: Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్‌

కొత్త జంట కార్తీక, సేల్వం తూత్తుకూడిలో ఇంట్లో నిద్రిస్తన్న సమయంలో ఆరుగురు యువకులు లోపలి చొరబడ్డారు. కార్తీక, సేల్వంన దారుణంగా చంపి పరారీ అయ్యారు. విషయం తెలిసిన సేల్వం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నారు అయ్యారు. కార్తీక తల్లిదండ్రులుపై అనుమానం వ్యక్తం చేస్తూ.. సేల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ బాలాజీ, రూరల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ సురేశ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెండు మోటర్‌బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Show comments