NTV Telugu Site icon

CM Stalin: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం

Stalin

Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. అంతే కాకుండా జ్వరం తగ్గుముఖం పట్టేందుకు తగిన చికిత్స తీసుకోవాలని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. ఇక, వర్షాకాలం ప్రారంభం కాకముందే తమిళనాడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతివారం వేలాది వైద్య శిబిరాలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్కడ జ్వరానికి సంబంధించిన రుతుపవనాల ప్రభావాన్ని పరిశీలించి తగిన చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు.

Read Also: Producer: మహిళా జర్నలిస్టుతో సినీ నిర్మాత అసభ్య ప్రవర్తన

అయితే, సీఎం స్టాలిన్ నిరంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించడం, సమావేశాలు నిర్వహించడం వంటి పలు పనుల్లో నిమగ్నమై ఉండటం వల్లే ప్రస్తుతం ఆయన అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు తెలిపారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అయితే, ఇవాళ సీఎం స్టాలిన్ చెన్నైలోని బీసెంట్ నగర్‌లో “నడపోమోమ్ నాళం ఉత్శోవే”ను ప్రారంభించాల్సి ఉండగా.. ఆ పథకాన్ని మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇక, అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆయన వెల్లడించారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయంలో రెండు కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండగా, చివరి క్షణంలో వాటిని రద్దు చేశారు.

Health Bulten