Site icon NTV Telugu

Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు

New Project (17)

New Project (17)

Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అలా చేసిన పోలీసు అధికారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా అంభాసముద్రంలో విచారణ ఖైదీల దంతాలను పీకి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంలో ఏఎస్పీ బల్వీర్‌సింగ్‌ సహా ముగ్గురు పోలీసులపై సీబీసీఐడీ ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్‌ ఉలగరాణి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బల్వీర్‌ సింగ్‌, మరి కొంతమందిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read Also:Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..

విక్రమసింగపురం పోలీసు స్టేషన్‌లో 17 ఏళ్ల బాలుడి దంతాలను పీకినట్లు బాధితుడి తరఫు అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. బల్వీర్‌ సింగ్‌తో కలిసి వీకేపురం స్టేషన్‌లో విధులు నిర్వహించిన ప్రత్యేక విభాగ పోలీసు బోగన్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మురుగేశన్‌లపై క్రైం బ్రాంచి ఎస్సీ శంకర్‌ ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పైగా అరుణ్‌ తరఫున ఏడుగురు శుక్రవారం సీబీసీఐడీ కార్యాలయంలో హాజరుకానున్న నేపథ్యంలో బల్వీర్‌సింగ్‌ సహా 8 మంది కూడా విచారణకు హాజరవ్వాలని సమన్లు పంపారు.

Read Also:TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు

Exit mobile version