NTV Telugu Site icon

Stalin: ఆ చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ సీఎం స్టాలిన్

Stalin

Stalin

Stalin: గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో ఉత్తమ నటుడిగా పుష్ప 1 సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక అవార్డులలో ఎక్కువ టాలీవుడ్ కే దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కూడా మంచిగానే అవార్డులను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికైన వారికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అయితే ఈ అవార్డులకు ఎంపికైన వారికి తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కూడా ఎక్స్(ట్విటర్) వేదికగా అభినందనలు చెప్పారు. అయితే వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను అవార్డుకు ఎంపిక చేయడాన్ని మాత్రం స్టాలిన్ తప్పుబట్టారు. బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రిటీ విభాగంలో నర్గీస్ దత్ అవార్డును ఈ చిత్రానికి ప్రకటించారు.విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ సినిమాకు జాతీయ సమైక్యత విభాగంలో అవార్డు ఇవ్వడం సరి కాదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడం అంటే అది ముమ్మాటికీ జాతీయ సమగ్రతను దెబ్బతీసే చర్యే అవుతుందని స్టాలిన్ మండిపడ్డారు. ఎక్స్(ట్విటర్) ద్వారా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Uttarpradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే వివాదాస్పద చిత్రంగా విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఈ చిత్రాన్ని ముస్లిం వర్గాలు, సమైక్యవాదులు వ్యతిరేకించారు. సినిమా విడుదను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం తెరకెక్కించిందని చాలా మంది విమర్శించారు. దీనిని థియేటర్లలో ప్రదర్శించకుండా నిలిపివేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అన్ని అడ్డంకులను ఎదుర్కొని విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇక దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అవార్డుల్లో ఉత్తమ నటిగా గంగుబాయి కతియావాడియా చిత్రానికిగానూ అలియాభట్ ఎంపికయ్యింది.