NTV Telugu Site icon

Tamannah : ఆ కారణం వలనే విజయ్ వర్మను ప్రేమించాను..

Whatsapp Image 2023 07 04 At 7.35.05 Pm

Whatsapp Image 2023 07 04 At 7.35.05 Pm

తమన్నా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా నేటి తరం హీరోయిన్ లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది తమన్నా.తమన్నా వరుసగా వెబ్ సిరీస్ లు మరియు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలే ఆమె వరుసగా రెండు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించిన సంగతి లిసిందే. వాటిలో ఆమె బోల్డ్ గా నటించడం తో ఆమె పై తీవ్రంగా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.అలాగే బాలీవుడ్ నటుడు అయిన విజయ వర్మ ని ప్రేమిస్తున్నట్లు తమన్నా తెలపడం తో ఆ విషయం కూడా బాగా వైరల్ అయింది.తనపై వచ్చే ట్రోల్లింగ్స్ పై మరియు నెగిటివ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తుంది తమన్నా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..విజయ్ వర్మ  నా జీవితంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా భావాలను గౌరవించే అద్భుతమైన వ్యక్తి విజయ్ వర్మ. అతడి జీవితాన్ని ఎంతో మంది మహిళలు ప్రభావితం చేశారని నేను భావిస్తాను.

అతడు తన కుటుంబంలోని స్త్రీల పై ఎంతో గౌరవం చూపుతాడు.. బయట మహిళలతో కూడా ఎంతో మర్యాదగా నడుచుకుంటాడు.నేటి యువతకు స్త్రీలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పాలి. ప్రతి విషయంలోనూ మహిళలు రాజీపడాలనే భావనలను నేను అస్సలు అంగీకరించను. ఇక విజయ్ నా అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తాడు. అందుకే తను నా మనసుకు ఎంతగానో దగ్గరయ్యాడు అని చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటి. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం కూడా ఉంది.

Show comments