NTV Telugu Site icon

Tamannah : ఆ సీన్స్ లో నటించడం పై స్పందించిన తమన్నా..

Whatsapp Image 2023 06 20 At 9.58.00 Am

Whatsapp Image 2023 06 20 At 9.58.00 Am

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ జి కార్ధ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది.. ఈ వెబ్ సిరీస్ తో అందరి దృష్టి తనపై పడేలా చేసింది తమన్నా.ఈ వెబ్ సిరీస్ పైనే అందరి ఆసక్తి కనబరిచేలా చేసింది.. అందుకు కారణం ఇందులో తమన్నా హాట్ షో చేయడమే అని తెలుస్తుంది.. కానీ ఈ విషయంలో అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది తమన్నా.

జి కార్దా సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది.అయితే ఈమె బోల్డ్ గా నటించడం పై పలు రకాల విమర్శలు రావడంతో వీటి పైన స్పందించింది తమన్నా. ఈ వెబ్ సిరీస్ కూడా ట్విస్టులతో కూడి ఉండడంతో ప్రేక్షకులు ఎంతో ఎక్సైటింగ్ గా చూస్తున్నారని సమాచారం.. ఈ సిరీస్ పై వస్తున్న విమర్శలపై తమన్నా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ కథకు ఇలాంటి సీన్స్  చాలా అవసరం అనిపించాయి కాబట్టే ఇందులో నటించాను ఇందులో అస్సలు తప్పేమీ లేదంటూ చెప్పుకొచ్చింది తమన్నా.ఒక రిలేషన్ షిప్ ని పూర్తి వాస్తవంగా చూపించడంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అవసరం అవుతాయి… అలాంటి సన్నివేశాలు చేయవలసి వచ్చింది ఎవరు విమర్శలు చేసిన అది నచ్చినా నచ్చకపోయినా కథలో భాగం కాబట్టే అలాంటి వాటిలో నటించానని తమన్నా తెలిపింది.ఓ ఇద్దరి వ్యక్తుల జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలోని అలాంటి సన్నివేశాలు వచ్చాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.ప్రస్తుతం తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్ 2 కూడా ఈ నెలలోనే స్ట్రీమ్ అవ్వబోతుంది. అందులో కూడా ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ లో నటించారు తమన్నా.

Show comments