NTV Telugu Site icon

Tamannah : అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మిల్కీ బ్యూటీ..!!

Whatsapp Image 2023 06 12 At 11.30.42 Am

Whatsapp Image 2023 06 12 At 11.30.42 Am

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్స్ దక్కించుకోవడం అంత సులభం కాదు. హీరోయిన్ గా చాన్స్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే దానితో పాటు అందం కొంచెం అదృష్టం కూడా ఉండాలి.ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హీరోయిన్ గా రాణిస్తారు.అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అద్భుతంగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. ఈ ముద్దు గుమ్మ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీడేస్ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత తమన్నా కు తెలుగు సినిమా పరిశ్రమలో  అదిరిపోయే సినిమా అవకాశాలు వచ్చాయి.. అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సాధించడంతో ఈమె చాలా సంవత్సరాలు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికి కూడా తాను తెలుగు సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఈ సినిమా ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారని సమాచారం.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు సుశాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తమన్నా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ హాట్ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ను వేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తాను వేసుకున్న కొట్ బటన్స్ ను మొత్తం విప్పేసి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Show comments