ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్’.జమ్మూకశ్మీర్‌లోని థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చిన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా భారీ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన “శరరత్” పాట విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సాంగ్‌లో తొలుత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ భావించారట. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం.. ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మాట్లాడుతూ..
Also Read : Rashmika Mandanna : రష్మిక ‘మైసా’ గ్లింప్స్ డేట్ లాక్.. కొత్త అవతారంలో నేషనల్ క్రష్
‘‘శరరత్ పాట కోసం నేను తమన్నా పేరును ప్రతిపాదించాను. కానీ ఆదిత్య ధర్ దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ తమన్నా ఈ పాటలో కనిపిస్తే, ప్రేక్షకులు దీన్ని కేవలం ఒక ‘స్పెషల్ ఐటమ్ సాంగ్’ లాగే చూస్తారు తప్ప కథలో భాగంగా చూడరు. ఆమె స్క్రీన్ మీద ఉంటే అందరి దృష్టి ఆమె డ్యాన్స్‌పైనే ఉంటుంది, దాంతో ఆడియన్స్ కథ నుంచి డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని దర్శకుడు వివరించారట. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుంది.
ఈ పాటను కేవలం ఒక కమర్షియల్ హంగులా కాకుండా, కథాంశంలో భాగంగానే ఉంచాలని ఆదిత్య ధర్ గట్టిగా నిర్ణయించుకున్నాడట. అందుకే స్టార్ హీరోయిన్ కంటే, ఇద్దరు టాలెంటెడ్ అమ్మాయిలు ఉంటేనే బాగుంటుందని భావించి అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాలను ఎంపిక చేశారట. ‘జైలర్’లో ‘కావాలయ్య’ వంటి పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమన్నా ఈ సినిమాలో ఉంటే బాగుండేదని అభిమానులు భావించినప్పటికీ, సినిమా విజయం కోసం దర్శకుడు తీసుకున్న నిర్ణయం సరైందేనని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
