Site icon NTV Telugu

Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్‌’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aranmanai 4 Ott

Aranmanai 4 Ott

Aranmanai 4 Streaming on Disney+ Hotstar: కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్టార్ హీరోయిన్స్ రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అరణ్మనై 4లో వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్‌’ పేరుతో విడుదలై.. ప్రేక్షకులను అలరించింది.

థియేటర్లలో అలరించిన అరణ్మనై 4 చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి అరణ్మనై 4 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: Alia Bhatt: హాలీవుడ్‌ సినిమా చేయడానికి కారణం అదే: అలియా

అరణ్మనై 4లోని ‘అచ్చో అచ్చో అచ్చాచ్చో.. ‘సాంగ్ ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఈ ఒరిజినల్ పాటను త్వరలోనే అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. 20 రోజుల్లో అరణ్మనై 4 బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది.

Exit mobile version