Alia Bhatt: హాలీవుడ్ సినిమా చేయడానికి కారణం అదే: అలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్‌లో అలియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవల ‘మెట్ గాలా’లో అలియా భట్ మెరిశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా పలు విషయాలపై స్పందించారు. ‘నేను అన్ని భాషల సినిమాలు చూస్తాను. భాషపై దృష్టి పెట్టకుండా.. భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా. నేను హాలీవుడ్‌లో హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా చేయడానికి కూడా కారణం ఇదే. కథ నాకు బాగా నచ్చింది. సరిహద్దులను అధిగమించేది కథనంలోని భావోద్వేగాలు మాత్రమే. అందుకే హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించా’ అని అలియా చెప్పారు.
Also Read
Also Read: Sai Pallavi: మరో ప్రేమ కథలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?
‘కెరీర్ తొలినాళ్ల నుంచి నాకు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఏదైనా పాత్ర చేస్తున్నానంటే ఆ పాత్రలో లీనమైపోతా. భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతాం అని నేను నమ్ముతా. బిన్న పాత్రలు చేయగలనా అని నాకు నేను సవాలు చేసుకుంటా. మరిన్ని మంచి సినిమాలలో నటించాలి’ అని అలియా భట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ‘జిగ్రా’ సినిమాలో నటిస్తున్నారు. అలియా కోసం యువ డైరెక్టర్ శర్వరీ వాఘ్ స్పై యూనివర్స్ చిత్రం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?