Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aranmanai 4 Streaming on Disney+ Hotstar: కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్టార్ హీరోయిన్స్ రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అరణ్మనై 4లో వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదలై.. ప్రేక్షకులను అలరించింది.
థియేటర్లలో అలరించిన అరణ్మనై 4 చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూన్ 21 నుంచి అరణ్మనై 4 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Alia Bhatt: హాలీవుడ్ సినిమా చేయడానికి కారణం అదే: అలియా
అరణ్మనై 4లోని ‘అచ్చో అచ్చో అచ్చాచ్చో.. ‘సాంగ్ ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఈ ఒరిజినల్ పాటను త్వరలోనే అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. 20 రోజుల్లో అరణ్మనై 4 బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది.
Oru semma Family entertainer!
Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!