టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ గురించి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.. గత ఏడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించారు. ఈ సిరీస్ ద్వారా ఏర్పడిన ఆ పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ లీక్ అవ్వగా వీరి లవ్ మ్యాటర్ బయటపడింది.. ఇక అడ్డంగా దొరికిపోయాక ఇద్దరం ప్రేమలో ఉన్నామని అనౌన్స్ చేశారు..
ఇక పెళ్లి గురించి అడిగితే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.. ఇప్పటికి ఎన్నోసార్లు పెళ్లి పై వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.. వీరిద్దరూ పెళ్లికి ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్నటి మొన్నటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసిన తమన్నా తాజాగా దైవ చింతనలో మునిగిపోయింది.. వరుసగా దేవాలయాలను సందర్శిస్తుంది.. ఇటీవల కుటుంబ సభ్యులతో పాటు గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.. దీంతో మళ్లీ పెళ్లిపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి.. ఈ ఏడాదిలోనే పెళ్లి అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మరి ఈ అమ్మడు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి..