Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు

Tamannah

Tamannah

రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన తమన్నా భాటియా, తాజాగా ‘ఐటమ్ సాంగ్’ అనే పదంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఐటమ్ సాంగ్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని ‘స్పెషల్ డ్యాన్స్ నెంబర్’ అని మాత్రమే పిలవాలని తమన్నా కండిషన్లు పెడుతోంది. దీంతో నెటిజన్లు ఆమె వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

టాలీవుడ్‌లో ‘స్వింగ్ జరా’, ‘లబ్బర్ బొమ్మ’, ‘డాంగ్ డాంగ్’ మరియు జైలర్‌లో ‘కావాలయ్యా’ వంటి పక్కా మాస్ ఐటమ్ సాంగ్స్‌తోనే తమన్నా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘ఆజ్ కీ రాత్’, ‘నషా’ వంటి పాటల్లో మల్లికా షెరావత్, మలైకా అరోరాలను మించి ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయడం వల్లే ఆమెకు అక్కడ అవకాశాలు వస్తున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ పాటల ద్వారా కోట్లలో భారీ పారితోషకం, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటూ.. తీరా ఇప్పుడు ఆ పేరును తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని, ఇది తమన్నా ద్వంద్వ నీతికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ అయ్యాయి.