NTV Telugu Site icon

Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా..

Whatsapp Image 2023 06 28 At 3.02.11 Pm

Whatsapp Image 2023 06 28 At 3.02.11 Pm

తమన్నా కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ “జీ కర్థ”అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఆ సిరీస్ లో ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది..తమన్నా ఎప్పుడూ చేయని బోల్డ్ సీన్స్ ఈ వెబ్ సిరీస్ లో చేసింది. అలాగే ఆమె నటించిన మరొక కొత్త వెబ్‌సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌2′ ఈనెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది సదరు నిర్మాణ సంస్థ. ఇందులో భాగంగా తమన్నా తన ట్విటర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేసింది. ఈ వెబ్ సిరీస్ చూసేప్పుడు ఎవరైనా వస్తే మధ్యలో నే ఆపేయాల్సిన పని లేదని ఆమె చెప్పుకొచ్చింది.

”లస్ట్‌ స్టోరీస్‌2’ ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడింది అని ఆమె తెలిపింది.. లస్ట్‌ అనే పేరు చూసి ఎవ్వరు కూడా భయపడకండి. ఇందులో అందరి ప్రేమను ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సిరీస్‌ చూసేటప్పుడు ఎవరైనా వస్తే కంగారు పడకండి సిరీస్ ను మధ్యలోనే ఆపేయకండి. అందరితో కలిసి దీన్ని చూడవచ్చు.అలా చూస్తే ఏమవుతుంది,తప్పేమి లేదు,తుఫానేమీ రాదు, ఆకాశం ఏమి ఊడి పడదు. మరెందుకు భయం రిలాక్స్‌ అవుతూ కూల్ గా ఈ సిరీస్ ను చూడండి అని తమన్నా ఆ వీడియో లో చెప్పింది. అయితే దీనిపై నెటిజన్లు ఎంతో ఫన్నీ గా కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ రొమాంటిక్‌ డ్రామాలో భాగంగా నటుడు మరియు తన ప్రియుడు అయిన విజయ్‌ వర్మ తో తమన్నా ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయింది.దీని కోసం సుమారు 18 ఏళ్ల నుంచి తాను ఫాలో అవుతోన్న నో కిస్‌ పాలసీని కూడా బ్రేక్‌ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.దీనిపై ట్రెండ్ తగ్గట్టు గా ఆర్టిస్ట్ లు నటనలో వైవిద్యం చూపాలని ఆమె పేర్కొనింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్‌ అవ్వాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆమె స్పష్టం చేసింది. ‘లస్ట్‌ స్టోరీస్‌’ మొదటి భాగం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘లస్ట్‌స్టోరీస్‌ 2’ వెబ్ సిరీస్ ను తీసుకు వచ్చారు. ఈ సిరీస్ కూడా అంతటి రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు..