Site icon NTV Telugu

Taliban – Islamabad: ఇస్లామాబాద్‌ను నాశనం చేస్తాం: తాలిబాన్లు

Taliban

Taliban

Taliban – Islamabad: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇకపై పాకిస్థాన్ నుంచి ఏవైనా దాడులు జరిగితే ఆఫ్ఘనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఆఫ్ఘన్ భూభాగంపై బాంబు దాడి చేస్తే, తాలిబన్లు ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుంటారని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఆఫ్ఘన్ చర్చలకు కట్టుబడి ఉంది. కానీ పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆఫ్ఘన్‌తో చర్చలకు సహకరించలేదు, చర్చలకు బదులుగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి భద్రతా హామీలను డిమాండ్ చేసింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న చర్చలను పాకిస్థాన్ ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆఫ్ఘనిస్థాన్ వర్గాలు ఆరోపించాయి.

READ ALSO: Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్‌ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు..
ఇటీవల రోజుల్లో సరిహద్దు దాడులు, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. వాస్తవానికి ఇది యుద్ధంలాంటి పరిస్థితికి దారితీసింది. అయితే ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత అక్టోబర్ 19న ఇరుదేశాల మధ్య తాత్కాలికంగా శాంతి నెలకొంది. ఈ చర్చలు విఫలమైతే పాకిస్థాన్ ఆఫ్ఘన్ తాలిబన్లతో పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని దాయాది దేశం రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సైన్యాన్ని హెచ్చరించారు.

ట్రంప్ ఏం చెబుతున్నారంటే..
ఇదిలా ఉండగా ఆదివారం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రయత్నాలు ప్రారంభించాయని తెలుసుకున్నానని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చాలా త్వరగా పరిష్కరిస్తామని తాను హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు.

READ ALSO: Good News to Cotton Farmers: పత్తి రైతులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

Exit mobile version