కిషన్ రెడ్డి అమావాస్య పౌర్ణమి కి హైదరాబాద్ వస్తున్నాడంటూ విమర్శలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఉన్నా అని అనవసర మాటలు మాట్లాడుతున్నారని, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి.. కేంద్రము నుండి ఏం తేచ్చావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరం లేదు…సికింద్రాబాద్ పార్లమెంట్ కైనా ఏం తెచ్చావో చెప్పు అని ఆయన సవాల్ విసిరారు. కనిపించినప్పుడల్లా కిషన్‌రెడ్డి రాజకీయాలే మాట్లాడతారా..? అని ఆయన ఫైర్ అయ్యారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ ఫెయిల్ అంటున్నారని, దర్యాప్తు సంస్థలపై మీకున్న చిన్నచూపు అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. కిషన్‌రెడ్డి విమర్శల్లో కాదు. అభివృద్ధిపై పోటీ పడాలని మంత్రి తలసాని హితవు పలికారు.
Also Read : Ponniyin Selvan 2: ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ న ‘పొన్నియిన్ సెల్వన్ 2’!
హైకోర్టు కేసు లేదు అన్నదా అని ఆయన అన్నారు. బాధితులు సీఎం కేసీఆర్ కి చెప్పారని, నాది అంబర్‌పేట అంటావు కదా.. అంబర్ పేట కి ఏం చేశావో చెప్పు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీ ఓ వైపు సబంధం లేదు అంటారు.. ఇంకో వైపు కోర్టుకు వెళ్లారు.. ఇంకో వైపు సంబరాలు చేసుకుంటారు అంటూ ఆయన విమర్శించారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా.. సంబరాలు చేసుకోవడానికి అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడలేమా.. పరిధి దాటి మాట్లాడొద్దని ఆయన అన్నారు. బీజేపీ శక్తి ఏందో మాకు తెలియదా..? ఎట్లా వస్తది అధికారంలోకి బీజేపీ.. ఒక వ్యవస్థ నుండి.. ఇంకో వ్యవస్థకు కేసు బదిలీ చేస్తే ఫెయిల్ అయిపోతుందా..? కేంద్ర మంత్రులు ఇలా మాట్లాడటంతోనే వ్యవస్థలపై అనుమానం వస్తాయి. దొరికిన వాళ్ళ ఆడియో..వీడియో అబద్దమా..? ఎవరు ఎవరి మీద బురద జల్లినా ప్రజా కోర్టు నిర్ణయిస్తుంది. ఎప్పుడు కాలం ఒకలా ఉండదు అని మంత్రి తలసాని అన్నారు.
