NTV Telugu Site icon

Talasani Srinivas : మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది

Talasani

Talasani

అయ్యప్ప స్వామిని ఉద్దేశించి బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సమాజంలోని ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని మంత్రి తలసాని అన్నారు.
Also Read : Liquor Sales: న్యూఇయర్‌ జోష్.. ఏపీలో జోరుగా లిక్కర్‌ సేల్స్
తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టదని, అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ అయ్యాడు. నేడు వరంగల్‌లో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్‌ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.