హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
Also Read : Hockey 5s Asia Cup 2023: క్రికెట్‌లో ఫట్.. హాకీలో హిట్.. ఫైనల్లో పాకిస్తాన్ ఓటమి
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, హైదర్ నగర్, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, అమీర్‌పేట్, మైత్రీవనం, పంజాగుట్ట, బేగంపేట. , సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, ముషీరాబాద్, కోఠి, నారాయణగూడ, మలక్‌పేట్, అంబర్‌పేట్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Also Read : Sonia Gandhi: సోనియా గాంధీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
