Eye Care: కళ్ల ఆరోగ్యానికి ఇవి తీసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eye Care: సర్వేంద్రీయానాం నయనం ప్రధానం అంటారు… అంటే మనిషిలోని అన్ని అవయవాల్లోకెల్లా కళ్లు ప్రధానమైవని అర్థం. మనిషి ప్రపంచాన్ని చూసేది కళ్లతో.. కళ్లు లేకపోతే మొత్తం చీకటే. చీకటిలో ఏమీ చూడలేము.. ఏమీ చేయలేము. అందుకే కళ్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఈ నేపథ్యంలో కళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్ ఏ మాత్రమే సరిపోదని.. కళ్లు హెల్తీగా ఉండటానికి మరికొన్ని మిటమిన్లు కూడా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి చూద్ధాం..
Read also:Hyderabad: హైదరాబాద్‌లో మరో చిన్నారిపై కుక్క దాడి..ప్రిన్సిపల్ పై కేసు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
విటమిన్ ఏ కంటిచూపునకు తోడ్పడుతుంది. విటమిన్ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ A గా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A 750 మి.గ్రాముల పరిమాణంలో ఉండాలి. బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), వెన్న, టమాటాలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి బి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తహీనతకు దారితీస్తుంది. దీని వల్ల కళ్లలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి విటమిన్ B12 సహాయపడుతుంది. నియాసిన్, విటమిన్ B3 విటమిన్లు గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారిస్తాయి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం ఆహారంలో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12లు ఉండే తృణధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, నట్స్‌ను తీసుకోవాలి.
Read also: Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
కంటి ఆరోగ్యంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సీ.. కళ్లను UV కిరణాల నుంచి రక్షిస్తుంది. విటమిన్ సి శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా.. వయస్సు పెరిగే కొద్దీ, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కళ్లను రక్షించుకోవడానికి సిట్రస్ కమల, బ్రోకలీ, బ్లాక్ బెర్రీలు, ద్రాక్షపండు, జామపండు, యాపిల్ వంటి పండ్లు తీసుకోవాలి. విటమిన్ E ఆల్ఫా టోకోఫెరోల్ మాలిక్యులర్ స్ట్రెక్చర్‌లో ఉంటుంది. విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, కళ్ల ప్రొటీన్ నిర్మాణాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ పొందడానికి బాదం, పొద్దుతిరుగుడు, వేరుశనగలు, సోయాబీన్స్ ను తీసుకోవాలి. విటమిన్లు కాకుండా కళ్లను ఆరోగ్యంగా ఉంచే మినరల్స్‌లో జింక్ కూడా ఒకటి. జింక్ కళ్ల ప్రొటీన్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. జింక్ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెలనిన్ కళ్లను యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. మన శరీరానికి రోజుకు 40-80 mg జింక్ అవసరం. అలాగే బీన్స్, చిక్‌పీస్, నట్స్, తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, పాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడంతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
- Tags
- care
- Eye
- Fruits
- Health. Vitamin
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!