NTV Telugu Site icon

Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు

Erath

Erath

తైవాన్‌ను మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజధాని తైపీలో భూకంపం కారణంగా పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: KKR vs PBKS: పంజాబ్ వీర విహారం.. సంచలన విజయం

తైవాన్‌లోని తూర్పు కౌంటీ హువాలియన్‌కు సమీపంలో శనివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, నష్టం గురించి ఇంకా అంచనా వేయలేదని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల ప్రారంభంలోనూ హువాలియన్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 17 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఇటీవల కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇళ్లులు నేలకొరిగాయి. మరికొన్ని బీటలు వారాయి. ప్రాణ నష్టం సంభవించినట్లుగా వార్తలు రాలేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లుగా అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Yuvraj Singh: భార‌త్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వాలంటే.. వారు ఆ పని చేయాలి..!

తైవాన్‌లో భూకంపాలు సంభవించడం కొత్తేమి కాదు. 2016లో కూడా దక్షిణ తైవాన్‌లో భూకంపం వచ్చి 100కి పైగా ప్రజలు మృతిచెందారు. 1999లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చి దాదాపు 2 వేల మంది చనిపోయారు. ఇక ఏప్రిల్ మొదట్లో వచ్చిన భూకంపంతో 17 మంది చనిపోయారు. తైవాన్ ప్రాంతంలో అందమైన ప్రదేశాలున్నద్వీపం.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో తక్కువ జనాభా కలిగిన తూర్పు తీరం వెంబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం కఠిన పర్వతాలు, హాట్ స్ప్రింగ్ రిసార్ట్ లు, ప్రశాంతమైన పొలాలతో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Monditoka Jagan Mohan Rao: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే నడిపిస్తున్నారు..