NTV Telugu Site icon

Fancy Numbers Demand : : ఫాన్సీ నెంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజులో 52 లక్షల పైచిలుకు బిడ్‌

Fancy Number

Fancy Number

Fancy Numbers Demand : :  ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ లో ఫాన్సీ నెంబర్ లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.. ఖైరతాబాద్ ఆర్టిఏ పరిధిలో ఒక్కరోజులో 52 లక్షల 52 వేల 283 రూపాయల బిడ్ పలికింది..

 Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత

TG 09 D 0001 నెంబర్ కోసం 11 లక్షల 11 వేల 111 రూపాయలతో రుద్రరాజు రాజీవ్ కుమార్ సొంతం చేసుకున్నారు. TG 09 D 0009 నెంబర్ 10 లక్షల 40 వేలకు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు సొంతం చేసుకున్నారు. TG 09 C 9999 నెంబర్ ని 7లక్షల 19 వేల 999 రూపాయలకు శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకున్నారు. TG 09 D 0006 నెంబర్ ని 3 లక్షల 65 వేల రూపాయలకు పోరస్ అగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సొంతం చేసుకున్నారు.. TG 09 D 0005 నెంబర్ వేగ శ్రీ గోల్డెన్ డైమండ్స్ వారు దక్కించుకున్నారు.

UP: కాల్చిన శనగపప్పు తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం!