Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : బేగంపేట స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తోంది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూళ్లూరు పేట స్టేషన్‌లు ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి చూస్తున్న బేగంపేట స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా మారిందని ఆనందం వ్యక్తం చేశారు.

Tamil Heros : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న.. కోలీవుడ్ హీరోస్ !

అలాగే, భవిష్యత్‌లో మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసికట్టుగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. గట్కేసర్ నుండి యాదాద్రి వరకు భక్తుల కోసం ఎంఎంటీఎస్ సర్వీస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ రైల్వే మార్గాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఘట్ కేసర్ – యాదాద్రి మార్గాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయాలన్న దిశగా ప్రయత్నిస్తున్నామని, దీనిపై సీఎం తో చర్చించి త్వరిత క్లియరెన్స్‌కి సహకరిస్తానని తెలిపారు.

India U19: ఇంగ్లాండ్ పర్యటనకు అండర్-19 జట్టు ప్రకటన.. జట్టులోకి చిచ్చరపిడుగులు ఎంట్రీ..!

Exit mobile version