NTV Telugu Site icon

Chamala Kiran Kumar Reddy : నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు

Mp Chamala

Mp Chamala

Chamala Kiran Kumar Reddy : తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది కేటీఆర్‌ అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ చామల కిరణ్‌ కమార్‌ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు కేటీఆర్‌.. నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు అని ఆయన మండిపడ్డారు. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన నువ్వు వ్యవహారించారని, నీ బాగోతం.. నువ్వు, తెలంగాణ ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. నువ్వు ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు. FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్ కి నేనే తీసుకొచ్చాను, దానిని కాపాడాలని ఇది హైదరాబాద్ కి తలమానికం అని, అందుకోసమే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని గొప్పలు, ప్రగల్బాలు పలుకుతున్నావు కేటీఆర్, నిజ నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని, ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం నీకు అత్యంత దగ్గర మిత్రులు అని ఆయన అన్నారు.

Daaku Maharaaj : వంద కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్.. బాలయ్య కింగ్ అఫ్ సంక్రాంతి

వారిని కాపాడటానికి సీజన్ 1కి వాగ్దానం చేసిన 90 కోట్ల చెల్లించని కారణంగా.. 30 కోట్లు ఇచ్చి, 60 కోట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్లు నోటీసులు జారీ చేసి, కాంట్రాక్టు రద్దు చేస్తామని చెప్తే, నీ మిత్రులు గ్రీన్ కో ప్రమోటర్స్ ను నీ బాల్య మిత్రులను కాపాడడం కోసం అక్టోబర్ 2023లో హెచ్ఎండిఏ నిధుల నుండి నిధులు ట్రాన్స్ఫర్ చేసి వారిని కాపాడడం జరిగింది మీరు అని ఆయన వెల్లడించారు. దానికి గ్లోబల్ హైదరాబాద్‌ను కాపాడడం కోసమే అని గొప్పలు అని, నీ మిత్రులకు తెలంగాణ సంపదను దోచిపెట్టినవ్ అని తెలంగాణ ప్రజలకు క్లియర్ గా తెలుసు అని ఆయన విమర్శించారు. నువ్వు స్వాతంత్ర్య సమరయోధునిగా, ఏదో దేశానికి గొప్ప చేశాను అనే విధంగా గొప్పలు చెప్తున్నావ్ ఈ కార్ రేస్ విషయంలో.. నీ గురించి, నీ వ్యవహారం గురించి, ఈ కార్ రేస్ విషయంలో ఏం జరిగింది అనే విషయం గురించి ప్రజలు గమనిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Bidar: ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షలతో జంప్

Show comments