NTV Telugu Site icon

Nara Lokesh : మన్మోహన్‌ సింగ్ ఓ అరుదైన రాజకీయ నాయకుడు.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్‌

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురించి మంత్రి నారాలోకేష్‌ ఆశక్తి కర ట్వీట్ చేశారు. భారతదేశం మన్మోహన్ సింగ్ అస్తమయంపై శోకసంద్రంలో మునిగిన సమయంలో ఆయన మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకోవాలంటూ నారా లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘2004 మాకు పరీక్షా సమయం. అప్పడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్నికోల్పోయింది.. చంద్రబాబు నాయుడుపైనా ఆ ఎన్నికల ముందే భయంకరమైన దాడి అలిపిరి ఘటన రూపంలో జరిగింది.. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడుకు సెక్యూరిటీని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.. దీంతో చంద్రబాబు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ను కలిసి తన సెక్యూరిటీని తిరిగి పునరుద్దరించాలని కోరారు. తనపై జరిగిన అలిపిరి నక్సల్స్ దాడి వ్యవహరాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..

అటు సెక్యూరిటీ ఏజెన్సీలు చేసిన హెచ్చరికలను ఆయన దృష్టిలో పెట్టారు. చంద్రబాబుకు ఎన్ ఎస్ జీ కమెండోలు తో కూడిన సెక్యూరిటీని రీస్టోర్ చేశారు. చంద్రబాబు కలిసిన సమయంలో ఆయన మీరు హైదరాబాద్ కు వెళ్లేసరికే మీకు అక్కడ ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ సిద్ధంగా ఉంటుదని చెప్పారు. మన్మోహన్‌ సింగ్ ఓ అరుదైన రాజకీయ నాయకుడు ఆయన పెద్ద మనస్సుకు మా కుటుంబం ఎంతో రుణపడిఉంది. ఆయనకు వీడ్కోలు పలుకుతున్నా, మా కుటుంబం ఆయన్ను ఎంతో మిస్ అవుతోంది.’ అని నారా లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Karnataka: సెల్‌ఫోన్ చూడొద్దని తల్లి మందలింపు.. విద్యార్థిని ఏం చేసిందంటే..!

Show comments