NTV Telugu Site icon

Tadipatri: ఆత్మహత్య చేసుకున్న తాడిపత్రి టౌన్ సిఐ.. కారణం అదేనా?

Tadipatri

Tadipatri

Tadipatri: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలరి అందరికీ ధైర్యం చెప్పే పోలీసులే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేకుండా ఉంది. పోలీసు ఉద్యోగం అంటేనే పని ఒత్తిడి.. దాంతో కొందరి కుటుంబాల్లో కలహాల కారణంగం ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నైట్ అలర్టింగ్ ఆఫీసర్‌గా డ్యూటీ చేసి ఇంటికెళ్లారు సీఐ ఆనందరావు. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇక ఈ విషాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సిఐ ఆనందరావు ఇంటికి చేరుకొని సంఘటన స్థలంలో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డ్యూటీ దిగి అంతమాత్రం ఇంటికెళ్లి వెంటనే ఇంత దారుణానికి పాల్పడడానికి కారణం ఏంటని అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆనందరావు ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటన్నది మిస్టరీగా మారింది. నిజానికి తాడిపత్రిలో పోలీస్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకుంది. పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిళ్లు కూడా బాగా ఉంటాయని టాక్ నడుస్తోంది.

Read Also:Sania Mirza : రిటైర్మెంట్ ప్రకటించిన కూడా మళ్ళీ టెన్నిస్ ఆడనున్న సానియా..

ఆనందరావు సెప్టెంబర్ లో ప్రొద్దుటూరు నుంచి సిఐగా బదిలీపై తాడిపత్రి కి వచ్చారు. విపరీతమైన పని ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తాడిపత్రిలో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దీంతో పోలీసులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తాడిపత్రి సిఐ ఆనంద్ రావు మృతి చెందిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతాపం తెలియజేశారు. సీఐ ఆనంద రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. సంఘటన స్థలాన్ని అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. సీఐ ఆనంద రావు మృతికి గల కారణాలపై ఎస్.పి శ్రీనివాసరావు కూడా ఆరా తీశారు. స్థానికంగా సిఐ ఆత్మహత్య చేసుకోవడంతో తాడిపత్రి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Read Also:Mrunal Thakur: సీక్రెట్ ను రివిల్ చేసిన మృణాల్.. షాక్ లో ఫ్యాన్స్..