Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు, కాకర్ల రంగనాథ్ అనుచరులు పరస్పరం ఎదురెదురయ్యారు. మొదట నినాదాలతో ప్రారంభమైన వాగ్వాదం, తరువాత రాళ్ల దాడిగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందిన సమాచారం ప్రకారం, ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గానికి చెందిన వినాయక విగ్రహం నిదానంగా వెళ్తుండటంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై ఆగ్రహించిన రంగనాథ్, ప్రభాకర్‌రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని రాళ్ల దాడులు జరిగాయి. ఈ దాడిలో రంగనాథ్ వర్గానికి చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం.
Komatireddy Venkat Reddy : సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
ఈ సందర్బంగా ఉధృతరూపం దాల్చిన ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో శోభాయాత్రను తిరిగి కొనసాగించారు. ఘర్షణకు కారణంగా ప్రాంతంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఎన్నికల ముందు కాకర్ల రంగనాథ్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఎన్నికల అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజా ఘర్షణ ఆ విభేదాలనే ప్రతిబింబించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Man Kills Wives: బిహార్‌లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..
