NTV Telugu Site icon

T20 WC Winners List: టీమిండియా ఈసారైనా వరల్డ్ కప్ గెలుస్తుందా..? 2007-2024 విన్నర్స్ లిస్ట్

Winners List

Winners List

భారత క్రికెట్‌లో ధోనీ శకం ప్రారంభమైన సంవత్సరం 2007. MS ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ ఈ టోర్నీలో యువ జట్టుతో అడుగుపెట్టింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ టోర్నీలో విజయం సాధించింది. స్టార్ ఆటగాళ్లు లేకుండా.. భారత్ ఛాంపియన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ధోని సారథ్యంలోని యువ భారత జట్టు ఫైనల్లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించి.. తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

Hema : రేవ్ పార్టీ వివాదం.. ‘మా’ నుంచి హేమ తొలగింపు.. నటి కీలక వ్యాఖ్యలు

ఆ మ్యాచ్‌లో (2007 T20 WC భారతదేశం vs పాకిస్తాన్) గౌతమ్ గంభీర్ వీర విజృంభణ చేశాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 75 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇక.. బౌలర్లలో ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ చెరో 3 వికెట్లు తీసి పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో పాక్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవలేదు. ఈసారి వరల్డ్ కప్ టోర్నీని ముద్దాడాలని టీమిండియా తహతహలాడుతుంది.

Pinnelli Ramakrishna Reddy: ముందస్తు బైయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. కాసేపట్లో విచారణ

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. 2024 టీ20 ప్రపంచ కప్‌ గెలిచి 17 ఏళ్ల కలను నిజం చేయాలని భావిస్తున్నారు. అయితే.. 2007 నుండి అత్యధిక సార్లు టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్లు ఉన్నాయి. ఇంతకీ ఆ జట్లు ఏవో తెలుసుకుందాం. ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో రెండుసార్లు ఇంగ్లాండ్ కప్ గెలుచుకుంది. 2010లో వెస్టిండీస్ లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలిచి మొదటిసారిగా ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత.. 2022లో పాకిస్తాన్ ను ఓడించి మరోసారి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత.. వెస్టిండీస్ కూడా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 2012లో శ్రీలంకపై గెలిచింది. ఆ తర్వాత.. 2016లో ఇంగ్లాండ్ పై గెలిచి ట్రోఫీని ముద్దాడింది.

2007 నుంచి 2024 వరకు విన్నర్స్ లిస్ట్..
భారతదేశం (2007)
పాకిస్తాన్ (2009)
ఇంగ్లండ్ (2010)
వెస్టిండీస్ (2012)
శ్రీలంక (2014)
వెస్టిండీస్ (2016)
కోవిడ్-19 కారణంగా వాయిదా
ఆస్ట్రేలియా (2021)
ఇంగ్లాండ్ (2022)
2024..?