Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka vs Pakistan: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా నేడు శ్రీలంక, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ వీర బాదుడు బాదింది. ఓపెనర్ ఫర్హాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్న ఫర్హాన్ 100 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఫఖర్ జమాన్ సైతం 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాకిస్థాన్ స్కోర్ రెండు వందల మార్క్ దాటింది. ఎనమిది వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే శ్రీలంక 213 పరుగుల చేయాల్సి ఉంటుంది.
READ MORE: PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అయితే.. పాకిస్థాన్ అద్భుతంగా ఆరంభించింది. ఫర్హాన్ సాహిబ్‌జాదా, ఫఖర్ జమాన్ మొదటి ఓవర్ నుంచే శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూయించారు. ఇద్దరూ కలిసి 176 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. 16వ ఓవర్లో ఫఖర్ జమాన్ 42 బంతుల్లో 84 పరుగులకు అవుట్ కావడంతో పాక్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాతి ఓవర్లోనే నాఫే 2 పరుగులకే అవుట్ అయ్యాడు. 198 పరుగుల వద్ద షాదాబ్ ఖాన్ రనౌట్ కావడంతో మరో దెబ్బ తగిలింది. షాదాబ్ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఈలోగా క్రీజ్‌లో ఉన్న ఫర్హాన్ ఖాన్ 59 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. 19వ ఓవర్లో నవాజ్ డకౌట్ అయ్యాడు. వెంటనే.. 20వ ఓవర్లో ఫర్హాన్ సైతం పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఫర్హాన్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. లాస్ట్ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు పడ్డాయి. షాహీన్ అఫ్రిది 4(2) సైతం అవుట్ అయ్యాడు. చివరి నాలుగు ఓవర్లలో శ్రీలంక పునరాగమనం చేసింది. చివరి 26 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చింది. మధుషంక 3, డాసున్ శనక 2, చమీర ఒక వికెట్ పడగొట్టారు. ఇక శ్రీలంకను 147 వద్ద కట్టడి చేస్తేనే పాకిస్థాన్ సేమీస్‌కు చేరుతుంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!